KantaraChapter 1 : ఫస్ట్ లుక్ తోనే గూస్ బంప్స్ తెప్పించాడు

- Advertisement -


Kantara Chapter 1 : కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్-1’. గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఇప్ప టికే షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం.. ఈ సినిమా గురించి ఓ పెద్ద అప్ డేట్ ఇచ్చింది. కాంతార చాప్టర్ 1నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. దీనితో పాటు టీజర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ టీజర్ క్లైమాక్స్ సన్నివేశంతో మొదలవుతుంది. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి క‌నిపిస్తాడు.

ఈ ప్రీక్వెల్ మూవీలో రిషబ్ తండ్రి జీవితం, మరణానంతరం ఎక్కడికి వెళ్లాడు, పల్లెటూరి సంప్రదాయాలు ఎక్కడ మొదలయ్యాయి, దేవుడు ఫలానా తెగను ఎందుకు ఎంచుకుంటాడు అనే అంశాలను హైలైట్ చేసి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం రిషబ్ చాలా గ్రౌండ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే.. అలాగే తొలి భాగాన్ని రూ. 16కోట్ల బడ్జెట్లోనే తీసిన రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కోసం 120 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. దాంట్లో కేవలం ప్రీ ప్రొడక్షన్‌కే 20 కోట్లు ఖర్చు చేశారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here