Kamal Haasan : నటన పరంగా ఎవరైనా ఆదర్శంగా తీసుకొని కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటే కమల్ హాసన్ నటన ని చూసి నేర్చుకుంటారు. నటనలో ఆయన ఒక నిఘంటువు లాంటి వాడు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే ‘కమల్ హాసన్ రేంజ్ లో నటించాడు’ అని ఆయనతో పోల్చి చూస్తారు. ఆ రేంజ్ నటుడు ఆయన. అందుకే ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ రికార్డ్స్ ని పెడుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయన గత చిత్రం విక్రమ్ 480 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

చాలా మంది తెలుగు, తమిళ హీరోలకు ఈ రేంజ్ వసూళ్లు లేకపోవడం గమనించాల్సిన విషయం. అలా నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమల్ హాసన్ పై వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కమల్ హాసన్ కి అమ్మాయిల పిచ్చి ఎక్కువని, ఇది వరకు కోలీవుడ్ లో ఆయన ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్ జరిపాడని అంటుంటారు.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒక యంగ్ హీరోయిన్ మాత్రం కమల్ హాసన్ ని నాలుగేళ్ల క్రితం తెగ వేధించింది అట. ఒక ఈవెంట్ కి హాజరైనప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లో ఎవ్వరూ లేని సమయం లో కమల్ హాసన్ గదిలోకి చొరబడి అతనితో కాసేపు ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేసిందట. కమల్ హాసన్ అందుకు ఒప్పుకోకపోవడం తో కనీసం ఒక ఫోటో దిగే ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడింది అట. కమల్ హాసన్ ఇంత రాత్రి సమయం లో ఫోటో ఏంటి రేపు కలుద్దాం అని అని చెప్పినా కూడా వినలేదట ఆ హీరోయిన్. ఇక ఆమె గోల భరించలేక ఫోటో దిగాడు కమల్ హాసన్. ఆయనకీ ముద్దు పెడుతున్నట్టు ఫోజులు ఇచ్చి రేణు మూడు సెల్ఫీలు తీసుకుంది.

ఆ తర్వాత పక్క రోజు నుండి నీ సినిమాలో అవకాశం కావాలి, లేకపోతే ఈ ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ చేసి, నువ్వు నాతో డేటింగ్ చేసావని, మూడు సార్లు కడుపు చేసి అబార్షన్ చేయించవని చెప్తాను అంటూ కమల్ హాసన్ ని బెదిరించే ప్రయత్నం చేసిందట. దీంతో కమల్ హాసన్ ఆ హీరోయిన్ మాటలను మొత్తం రికార్డు చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు అప్పట్లో ఒక వార్త కోలీవుడ్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యింది. ఇదంతా విన్న తర్వాత ఇండస్ట్రీ లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.