Akshara Haasan : కమల్ హాసన్ చిన్న కూతురుని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేసిన స్టార్ హీరో!

- Advertisement -

Akshara Haasan : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ పేరు ముందు వరుస లో ఉంటుంది. నటన అనే పదం తీస్తే మనకి మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్. ఏ హీరో అయినా అద్భుతంగా నటిస్తే కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు. ఇక ఆయన కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కూడా నటనలో తండ్రికి తగ్గ తనయురాలు అని అనిపించుకుంది.

అనతి కాలం లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు మరియు తమిళం భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటించిన ‘సలార్’ చిత్రం కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈమెకి అక్షర హాసన్ అనే చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

Akshara Haasan
Akshara Haasan

అయితే ఈమె ఒక యంగ్ హీరో తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడిపినట్టు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తుంది. ఆ హీరో పేరు తనూజ్ విర్వనీ. ఇతను ప్రముఖ హీరోయిన్ రతి అగ్ని హోత్రి కుమారుడు. ఈయన 2013 వ సంవత్సరం లోనే కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు కానీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

- Advertisement -
Akshara Haasan Boyfriend

ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న తనూజ్ చాలా కాలం వరకు అక్షర హాసన్ తో ప్రేమాయణం నడిపాడట. కానీ ఎందుకో వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి విడిపోయారు. వీళ్ళు కలిసి తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అక్షర హాసన్ తో విడిపోయిన తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేసిన తనూజ్ చివరికి తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here