టెలివిజన్ చరిత్రలో అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాష – భేదం తేడా లేకుండా భారీ ఆదరణతో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది అంటేనే అభిమానుల్లో మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. క్యూరియాసిటీ ..ఆనందం.. అమాయకత్వం .. ఆందోళన అన్నీ ఈ షోలో నెలకొంటున్నాయి. కాగా త్వరలోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది . అయితే తెలుగులో ఇన్నాళ్లు హోస్టుగా చేసిన నాగార్జున ఈసారి ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఆయన ప్లేస్ లో రానా దగ్గుబాటి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోనే తమిళ్ బిగ్ బాస్ ఏడవ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈసారి కూడా తమిళ్ బిగ్ బాస్ కి హోస్టుగా కమలహాసన్ చేస్తున్నారట . అయితే ఇప్పటి వరకు ఎవ్వరు చేయని సాహసాన్ని కమలహాసన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం ఏకంగా 130 కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారట కమల్. సినిమా స్టార్లు ఏ షోకు వెళ్లినా రూ. వందల కోట్లు తీసుకోవడంతో వారి పంట పండుతోంది. అన్ని భాషల్లో నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోలలో హోస్ట్ లకు కూడా బాగా గిట్టుబాటవుతుంది.
తమిళ బిగ్ బాస్ షోకు కమల్ ఏకంగా రూ. 130 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్క సినిమా పారితోషికం కంటే చాలా ఎక్కువ. దానికి కారణం ఆయన నటించిన విక్రమ్ సినిమా ఇటీవల హిట్ అవ్వడం .. త్వరలోనే ప్రాజెక్టు కే సినిమాలో విలన్ గా నటిస్తుండడంతో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా కమల హాసన్ ఇంత డిమాండ్ చేస్తున్నారట . అయితే మేకర్స్ సైతం ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం గమనార్హం. ఈ న్యూస్ ప్రెసెంట్ చెన్నై ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది .