ఎన్టీఆర్ తో సాయిపల్లవి.. అన్ని సీన్లకు ఓకే చెప్పినట్లేనా..!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న కొత్త సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలు అంతా మరిచేలా ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఎన్టీఆర్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టి భారీ రేంజ్ లో రూపొందిస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను స్టార్ట్ చేసిన కొరటాల శివ.. దీనికి దేవర అనే స్ట్రాంగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ తో ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దేవరకు సంబంధించి బిగ్గెస్ట్ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి.

సాయిపల్లవి
సాయిపల్లవి

ఈ క్రమంలోనే దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి సాయి పల్లవి నటిస్తుందనే ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సాయి పల్లవితో ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్- సాయి పల్లవి జంటగా కనిపించనున్నారు అనే విషయం నందమూరి అభిమానులకు మంచి కిక్కిస్తుంది. ఇంకేమేంది అన్ని సీన్లకు న్యాచురల్ బ్యూటీ ఓకే చెప్పేసిందనుకున్నారంతా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది.

ఫ్లాష్ బ్యాక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సాయి పల్లవి భార్యగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై దేవర సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయమై చిత్ర అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు అవాస్తవమని పేర్కొంది. దీంతో చాలా మంది సాయి పల్లవి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అంచనాలు తారుమారయ్యాయి. సాయి పల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది అవాస్తవమని తేలింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here