Kalki 2898 AD సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది.. ఈ సినిమా గత నెలలో అయినా రెండో వారం కూడా సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది.. 9 రోజులకు 850 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం 1000 కోట్లకు చేరువలో ఉంది.. ఈ సినిమాకు నాగీ దర్శకత్వంలో వహించారు… ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించాడు.. అయితే ఈ సినిమాలో నాగీకి నచ్చిన ప్రత్యేక ప్లేస్ ఒకటి ఉందట.. ఆ స్పెషల్ ప్లేసులోనే ఎక్కువగా గడిపేవాడట ఆ ప్రాంతం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఒక డోర్ ఓపెన్ అయింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్‌లా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు.. సంభలా, కాంప్లెక్స్ రెండు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అందులో నాగీ ఇష్టమైన ప్లేస్ శంభల స్టెప్స్. అక్కడే కూర్చునే వాడిని. అక్కడ సైన్ రైజ్, సన్ సెట్ చాలా బావుంటుంది.. అక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఆయన అన్నారు..
ఇక మా ప్రోడుసర్స్ రిస్క్ తీసుకున్నారు. నేను ఇంత ఖర్చు చేయాలంటే.. దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు.. అంటే నా మీద నమ్మకం.. కథ, పాత్రలకు న్యాయం చేయలనే ఉద్దేశంతోనే అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక లాంటి పెద్ద యాక్టర్స్‌ని తీసుకోవడం జరిగింది.. పార్ట్ వారి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని నాగీ చెబుతున్నాడు.. మొదటి పార్ట్ జనాలను బాగా ఆకట్టుకుంది.. రెండో పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి…