లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కాజల్ అగర్వాల్. తొలి సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అగ్రహీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకప్పుడు కుర్రహీరోల దగ్గరనుంచి స్టార్లు వరకు అందరి ఫస్ట్ చాయిస్ కాజల్ అయిపోయింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ బిడ్డకు తల్లి అయింది.
తర్వాత కూడా కాజల్ కెరీర్ పరంగా దూసుకుపోతూనే ఉంది. ప్రస్తుతం బ్యూటీ మూడు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. అందులో ఒకటి నటసింహం బాలకృష్ణ భగవంత్ కేసరి
కాగా.. మరొకటి కమల్ హాసన్ ఇండియన్ 2
. అలాగే వీటితో పాటు సత్యభామ
అనే మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కాలంలో కాజల్ లేడీ ఓరియెంటెడ్ మూవీలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల విడుదలైన సత్యభామ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. కాజల్ క్వాల్షీట్లు ఖాళీగా లేకుండా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్క్ కాజల్ పేరిట సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేసింది. అందులో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇండిస్ట్రీకి చెందిన హీరోయిన్స్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు..? అని ప్రశ్నించారు. తాను వెంటనేరకుల్, తమన్నా, సమంత.. వీరు ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. షూటింగ్ నుంచి ఖాళీ దొరికితే మేము నలుగురు కలిసి బయట హోటల్స్ లో ట్రైమ్ స్పెండ్ చేసేవాళ్లం. ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్లం. వాళ్లతో టైం స్పెండ్ చేయడం నాకు ఎంతో ఇష్టం
అంటూ చెప్పుకొచ్చింది. కాజల్, రకుల్, తమన్నా, సమంతతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. కాగా, ఈ నలుగురు హీరోయిన్లు దాదాపు ఒకే టైమ్ లో కెరీర్ స్టార్ట్ చేశారు. దాంతో ఈ నలుగురి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.