Trisha – Nayanthara : కోలీవుడ్ లో టాలీవుడ్ బ్యూటీ జోరు.. నయనతారకు చెక్.. త్రిషకు థ్రెట్

- Advertisement -

Trisha – Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూ దక్కని ట్యాగ్ నయనతార సొంతం. ఈ భామ సినిమా ప్రమోషన్లలో పాల్గొనదూ.. అయినా సినిమాలు హిట్ అయిపోతాయి. కెరీర్ మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకున్న నయన్.. ఆ తర్వాత కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చేది నయనతారనే. అంతలా ఈ భామ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్.. వాళ్లను మించిన రెమ్యునరేషన్.. దక్కిన ఒకే ఒక నటి నయనతార. అలా మేల్ డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ హీరోలకు పోటీనిస్తూ ఏకచ్ఛత్రాధిపత్యం చేస్తోంది ననయన్.

Trisha - Nayanthara
Trisha – Nayanthara

అయితే ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీయే ఏకంగా బీ టౌన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో ఇచ్చింది. ఇక ఆ మూవీ కలెక్షన్ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా హిట్ కావడంతో నయన్ కు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయట. అందుకే ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతోందట ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతలకు తమ సినిమాలో నయనతారను తీసుకోవాలంటే ఆమె కాల్షీట్లు దొరకడం లేదట. అందుకే నయన్ తర్వాత ఆ రేంజ్ లో స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న మరో నటి త్రిష.

Trisha

- Advertisement -

తమిళంలో నయనతారని కాదని త్రిషను తమ ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నారట నిర్మాతలు. ఇప్పుడు కోలీవుడ్ లో కథా బలం ఉన్న పాత్రల్లో నటించాలంటే ఈ బ్యూటీనే సంప్రదిస్తున్నారట. మణిరత్నం పీఎస్-1,2, లియో సినిమాతో త్రిష రేంజ్ ఇప్పుడు మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రిష బిజీ అయింది. అయితే కొన్నిసార్లు త్రిష రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో పెంచేస్తుండటంతో నిర్మాతలు మరో ఛాయిస్ వెతుక్కుంటున్నారట.

Kajal Aggarwal

అలా త్రిషను కాదని టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ ఈ ఛాన్సులు కొట్టేస్తుందట. టాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు ఏలిన కాజల్.. యంగ్, సీనియర్, స్టార్ హీరోలతో నటించింది. కొందరితో రెండు మూడు సార్లు కూడా జతకట్టింది. అలా ఓ దశాబ్ధంపాటు ఏలిన కాజల్ పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుంది. తల్లయ్యాక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ జోరు సాగిస్తోంది. ఎలాగైనా మళ్లీ తన బేస్ స్ట్రాంగ్ చేసుకోవాలని ట్రై చేస్తోంది. అయితే ఇప్పుడు కేవలం గ్లామరస్ పాత్రలకే కాకుండా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని భావిస్తోందట.

ఇందులో భాగంగానే ఇప్పుడు కాజల్ సత్యభామ అనే చిత్రం చేస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది కాజల్. సినిమా టీజర్ అయితే కాజల్ ని కొత్తగా ప్రెజెంట్ చేసినట్లుగా చూపించింది.  ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించిన కాజల్ ఇక మీదట లీడ్ రోల్ లో చేసి అదరగొట్టాలని చూస్తుంది. సత్యభామ హిట్ పడితే మాత్రం తమిళంలో త్రిషతో పాటు కాజల్ కూడా బిజీ అవుతుందని ఇండస్ట్రీ టాక్. అలాగే జరిగితే కాజల్.. త్రిషక్ థ్రెట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఈ ఇద్దరు కలిసి తమిళ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతారకు చెక్ పెట్టేయడం ఫిక్స్ అని టాక్. త్రిషతో పోల్చుకుంటే కాజల్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కాబట్టి నయనతార, త్రిషల కన్నా ముందు కాజల్ కే ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కాజల్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com