Kajal Aggarwal : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమ పని చేసుకుని పోతుంటారు. ఎదుటి వాళ్ల ఎంత అరిచి రాద్ధాంతం చేసినా పెద్దగా పట్టించుని రియాక్ట్ కారు. సైలెంట్ గాని తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతూ ఉంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఆ డైరెక్టర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత సైలెంట్ పర్సన్ నో ఈ డైరెక్టర్ కూడా అంతే సైలెంట్ పర్సన్.
తన పని తాను చూసుకొని వెళ్లిపోవడం తప్పిస్తే ఎదుటి వాళ్ల లైఫ్ లో వేలుపెట్టడు. అలాంటి మంచి డైరెక్టర్ కి స్టార్ హీరోయిన్ తల్లి శాపనార్థాలు పెట్టిదంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆమె మరి ఎవరో కాదు కాజల్ అగర్వాల్ తల్లిగారు. కాజల్ అగర్వాల్ ఆయన దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె ను కొన్ని కారణాల చేత షూట్ సగం అయిన తర్వాత తీసేశాడు.
కారణం ఏంటో తెలియదు కానీ ఆ టైంలో కాజల్ చాలా హర్ట్ అయింది. తన సన్నిహితుల దగ్గర చాలా బాధపడి ఏడ్చేసిందట. ఆమె బాధ చూడలేక కాజల్ తల్లి ఆ డైరెక్టర్ కు శాపనార్థాలు పెట్టేసారట . నా కూతుర్ని ఈ విధంగా ఏడిపిస్తాడా..? సర్వనాశనం అయిపోతాడు వాడు అంటూ దారుణంగా మాట్లాడిందట . అయితే అదంతా కోపంలోనే మాట్లాడింది అని .. ఆ తర్వాత కూల్ అయిపోయిందని ప్రతి తల్లి కూడా తన కూతురు బాధపడితే ఇలాగే రియాక్ట్ అవుతారని జనాలు క్లారిటీ ఇస్తున్నారు. అయితే కాజల్ అమ్మగారు నిజంగా ఆ మాటలు అన్నారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా ట్రెండ్ అయిపోయింది..!!