Animal Movie లో మెషిన్ గన్ తయారీ వెనుక ఇంత కథ ఉందా.. ఏదేమైనా ఇది సినిమాకే హైలెట్

- Advertisement -


Animal Movie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాల జాబితాలో యానిమల్ ఒక‌టి. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కింది ఈ సినిమా. ఇప్పటికే రూ.835.8కోట్ల రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ మెషిన్ గన్ ఉపయోగించే సీన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మిషన్ గన్ ను ఎలా తయారు చేశారనే ప్రశ్న అందరి మదిలో మొదలైంది. కొందరు ఇది నిజమైన మిషన్ గాన్‌ కాదు, గ్రాఫిక్స్ లో తయారు చేశారు. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అని అందరూ భావించారు. అయితే ఈ మిషన్ గ‌న్ నిజంగానే తయారు చేసినట్లు యూనిట్ చెప్తుంది.

Animal Movie
Animal Movie

మిషన్ గన్‌ తయారీ గురించి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడారు. ఈ మెషిన్ గన్ స్టీల్ తో తయారు చేయబడిందని.. దీని తయారీకి దాదాపు ఐదు నెలల సమయం పట్టిందని వివరించాడు. దీన్ని తయారు చేయడానికి వందల మంది కష్టపడ్డారని.. 500 కిలోల స్టీల్ వాడమని చెప్పుకొచ్చాడు. ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సన్నివేశాలు ఈ రేంజ్ లో ఆకట్టుకుంటాయని ఊహించలేదన్నారు.

Ranbir Kapoor Rashmika Mandanna

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్ తయారు చేశామన్నారు. మొదట డైరెక్టర్ పెద్ద మెషిన్ గన్ కావాలని చెప్పాడని.. అంత భారీగా తయారు చేయడానికి నాలుగు, ఐదు నెలలు పడుతుందని చెప్పానన్నారు. ఈ మిషన్ గన్ తయారీలో ఎంతో శ్రద్ధ వహించి వినూత్నంగా తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని.. ఆ మిషన్ గన్ బరువు 500 కిలోలని సురేష్ తెలిపాడు. ఇక దీని తయారీకి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చయిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here