‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తొలి సినిమానే కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే 2009లో వచ్చిన ‘మగధీర’ కాజల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత వరుసగా డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా సినిమా సినిమాకు తన క్రేజ్ పెరుగుతూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతుంది.
ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు డేటింగ్ లు అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటారు. ఇక ఈ నేపద్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా గతంలో ఓ స్టార్ హీరోని ప్రేమించిందట. ఇక ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని.రామ్ పోతినేని కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో గణేష్ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా టైంలో ప్రేమలో పడ్డ కాజల్ రామ్ పోతినేని ఇద్దరు చాలా రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారట.
అంతేకాదు ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కాజల్ స్వయంగా తన నోటితో చెప్పిందట. అంతే కాదు ఆ హీరో తో ఉన్న బంధం గురించి మాత్రమే కాకుండా తాను హీరో రామ్ పోతినేని తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ఓ బిజినెస్ మ్యాన్ తో కూడా తాను ప్రేమలో పడ్డానని చెప్పింది. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కాదు గౌతమ్ కిచ్లు..గౌతమ్ తో ఉన్న ప్రేమని అలాగే కంటిన్యూ చేసి చివరికి పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చింది.