Kajal Agarwal క్యూట్ క్యూట్ కాజల్.. తల్లయినా తగ్గని అందం



పెళ్లయి.. బిడ్డ పుట్టినా కాజల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. బిడ్డ పుట్టాక మరింత క్యూట్ గా తయారైంది. సిల్వర్ స్క్రీన్ కు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం కాజల్ తన ఫ్యాన్స్ కి దగ్గరలోనే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలోనూ ఫొటో షూట్ చేసి తన ఫొటోలతో తన హెల్త్, లైఫ్ అప్డేట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక బిడ్డ పూట్టక కూడా తన ఫొటో షూట్ లతో అభిమానులను అలరిస్తూనే ఉంది.

తాజాగా కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ లుక్ లో ఫొటో షూట్ చేసింది. స్లీవ్‌ లెస్‌ కుర్తా ధరించి చిలిపి పోజులిచ్చింది. ముసి ముసినవ్వులు నవ్వుతూ, ఇంకాస్త సిగ్గులొలికిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది కాజల్‌. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తల్లైనా కాజల్ అందం కాస్త కూడా తగ్గలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాజూ మరింత క్యూట్ అయిందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

వరుస ఫోటో షూట్లతో కాజల్ స్క్రీన్ కు దూరమైనా అభిమానులకు దగ్గరగా ఉంటోంది. త్వరలోనే మళ్లీ సినిమాల్లో వస్తాననే హింట్ ఇస్తోంది. ఇండియన్ 2 సినిమాలో త్వరలోనే నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క సినిమా తప్ప ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఆఫర్లేం లేవు. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్లని రిసీవ్‌ చేసుకునే కల్చర్‌ టాలీవుడ్ అలవాటు చేసుకుంటుందా.. అనే అసలైన ప్రశ్న. బాలీవుడ్‌లో కరీనా కపూర్‌, అనుష్క శర్మ, ఆలియా భట్ లాంటి హీరోయిన్లు తమ సత్తాని చాటుతున్నారు. కానీ టాలీవుడ్‌లో ఇదొక ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ విషయంలో కాజల్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.