తల్లి అయినా.. సినిమాల్లో మాత్రం ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న కాజల్

- Advertisement -

చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చందమామ మూవీతో కమర్షియల్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో తన అందచందాల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాజల్
కాజల్

ఇటు సీనియర్ హీరోలు, అటు అప్ కమింగ్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి హీరోతో జత కట్టి కనువిందు చేసింది ఈ పంజాబీ బ్యూటీ. వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచులుని వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు రీసెంట్ గా బేబీ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా ఈ అమ్మడు జతకడుతుండడం విశేషం. తల్లి అయ్యాక కూడా అందం విషయంలో ఎక్కడా తగ్గేదే లేదంటూ ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుంది ఈ అమ్మడు.

రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ NBK108 సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో బాలయ్య కి జోడిగా కాజు పాపని అప్ప్రోచ్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకి కాజల్ అగర్వాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 3 కోట్ల పారితోషికాన్ని ఈ ముద్దుగుమ్మ డిమాండ్ చేయడంతో మేకర్స్ షాకయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని బట్టి కాజల్ క్రేజ్ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. బాలయ్య పక్కన అందాలు ఆరబోయడానికి ఈ బ్యూటీ అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here