Jyothika సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా సూర్య – జ్యోతిక జంటకి మంచి పేరుంది.కోలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగిన సూర్య, ఆయనతో పాటుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జ్యోతిక ఒకరినొక్కరు ఘాడంగా ప్రేమించుకొని 2006 వ సంవత్సరం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.వీళ్లిద్దరి దాంపత్య జీవితం ప్రారంభమై 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది.వీళ్లిద్దరికీ దివ్య మరియు దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే సూర్య కుటుంబం మొత్తం కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు.

తమ్ముడు కార్తీ కుటుంబం మరియు తన అమ్మ నాన్నలతో కలిసి ఉమ్మడి కుటుంబం గా గత 19 ఏళ్ళ నుండి ఒకే నివాసం లో ఉంటూ వచ్చారు.మేమంతా ఇలా ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి కారణం మా వదిన జ్యోతికే అని సూర్య తమ్ముడు కార్తీ అనేక ఇంటర్వూస్ లో తెలిపాడు కూడా, అయితే ఈ ఉమ్మడి కుటుంబం ఇప్పుడు విడిపోయిందని తెలుస్తుంది.

గత కొంతకాలం నుండి సూర్య కి తన తండ్రి శివకుమార్ కి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయట.దానికి కారణం కూడా జ్యోతికనే అని తెలుస్తుంది.శివ కుమార్ కి మొదటి నుండి జ్యోతిక అంటే ఇష్టం ఉండేది కాదట.ఎందుకంటే సినిమా హీరోయిన్స్ పై ఆయనకీ మంచి అభిప్రాయం ఉండేది కాదు, తొలుత వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నామని శివ కుమార్ కి తెలపగా పెళ్ళికి ఆయన ఒప్పుకోలేదట.ఆ తర్వాత సూర్య ఎలాగో బ్రతిమిలాడి జ్యోతిక మేడలో తాళికట్టాడు.అయితే పెళ్ళైన తర్వాత జ్యోతిక సినిమాలలో నటించకూడదు అనే షరత్తు పెట్టాడట శివకుమార్.

అందుకు ఒప్పుకున్నా తర్వాతే వీళ్లిద్దరి పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఇచ్చిన మాట ప్రకారమే జ్యోతిక అప్పటి వరకు తానూ కమిటైన సినిమాలను పూర్తి చేసి ,నటనకి గుడ్ బై చెప్పింది.అయితే ఆమె మళ్ళీ 2017 వ సంవత్సరం నుండి సినిమాలు చెయ్యడం ప్రారంభించింది.అప్పటి నుండి శివ కుమార్ తో ఎదో ఒక గొడవ జరుగుతూ ఉండేదట.సూర్య మధ్యలో సర్దిచెప్పుకుంటూ వాళ్ళ మధ్య గొడవలను చల్లార్చేవాడు.అయితే ఈమధ్య విభేదాలు హద్దులు దాటడం తో సూర్య- జ్యోతిక తన పిల్లలతో బయటకి వచ్చి గత కొంతకాలం నుండి ముంబై లో ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నాడు.అక్కడి నుండి చెన్నై కి వచ్చి షూటింగ్స్ చేసుకుంటున్నాడట.ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచింది.
