Junior Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా.. ఈ అమ్మాయిని చూస్తే నిజమే అనిపిస్తోంది..?

- Advertisement -

Junior Soundarya : సినిమాలంటే ఇష్టపడని వారుండరు. ఇక సినిమా స్టార్లకి ఉండే హైపే వేరు. చాలా మంది అభిమానులు వాళ్ల ఫేవరెట్ స్టార్లను అనుకరిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం చూడ్డానికి స్టార్లలాగే ఉంటారు. అలా చాలా మంది సెలబ్రిటీలను పోలిన వాళ్లని మనం చూశాం. అచ్చం సినీ ప్రముఖుల పోలికలతో ఉండే వాళ్లు.. కేవలం వాళ్ల పోలికల వల్లే ఫేమస్ అయ్యారు కూడా. 

Junior Soundarya
Junior Soundarya

అయితే తాజాగా ఓ అమ్మాయి కూడా ఓ సినిమా సెలబ్రిటీ పోలికను కలిగి ఉండటం సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల కంట పడింది. సాధారణంగా ఆమె ఏ సెలబ్రిటీ పోలికను కలిగి ఉన్నా.. తెలుగు ఆడియెన్స్.. ఓ సేమ్ టూ సేమ్ ఉంది కదా అని ఓసారి చూసి తర్వాత లైట్ తీసుకునే వాళ్లు. కానీ ఈ అమ్మాయికి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ అమ్మాయి పోలిక.. ఓ లెజెండ్రీ నటితో కలిసి ఉంటుంది. ఆ నటి అంటే ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆమే.. అలనాటి సహజనటి సౌందర్య. 

Soundarya

సౌందర్య.. తెలుగు సినిమాల్లో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరి మదిలో మెదిలో రూపం. ఎన్నో అపూరమైన పాత్రల్లో నటించి ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిని తాకింది. అసలు సౌందర్యది తెలుగునాడు కాదు. ఆమెది కన్నడ రాష్ట్రం.. అదేనండి కర్ణాటక. అయినా కన్నడనాట కంటే తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడి కంటే ఇక్కడి ప్రేక్షకుల నుంచే నీరాజనాలు అందుకుంది. 

- Advertisement -

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో.. ఎంతో మంది అగ్రహీరోలతో.. ఒక్కొక్క స్టార్ హీరోతో అరడజనుకుపైగా సినిమాలు తీసింది. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందింది సౌందర్య. ఆమె మరణం తెలుగు సినిమాకు ఇప్పటికీ తీరని లోటే. ఆమెను రీప్లేస్ చేసే నటి ఇప్పటి వరకు రాలేదు. 

ఏ మాత్రం అందాల ఆరబోతకు ఛాన్స్ ఇవ్వకుండా చాలా సంప్రదాయంగా.. అంతే ట్రెండీగా కనిపించే సౌందర్య అంటే తెలుగు ప్రేక్షక లోకానికి ఎంతో అభిమానం. అలాంటి అందమైన సౌందర్య పోలికతో ఉన్న ఓ యువతి ఇటీవల మన తెలుగు ప్రేక్షకుల కంట పడింది. ఆమె పేరు చిత్ర. మలేషియాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించిన చిత్ర.. వయసుకొచ్చినప్పటి నుంచి తన రూపం సౌందర్య రూపాన్ని పోలి ఉండటం గమనించింది. ఇక చుట్టుపక్కల వాళ్లంతా సౌందర్యలా ఉన్నావంటూ చెప్పేవారు. అలాగే జూనియర్ సౌందర్య అని పిలిచేవారు. 

ఇక టిక్ టిక్ అందుబాటులోకి వచ్చాక చిత్ర సౌందర్య పాటలకు.. ఆమె డైలాగులకు లిప్ సింగ్ చేసి వీడియోలు పోస్టు చేయడంతో అవి మన తెలుగు ప్రేక్షకులను చేరాయి. వాటికి బీభత్సమైన క్రేజ్ రావడంతో చిత్రాజీ అనే యూజర్ ఐడీతో ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచి.. అక్కడ కూడా సౌందర్యకు సంబంధించిన వీడియోలు చేస్తూ పోస్టు చేస్తోంది. 

https://www.youtube.com/watch?v=AbroXFPDYhs&ab_channel=LikeKottu

ఎన్నో ఏళ్లుగా సౌందర్యను మిస్ అవుతున్న తెలుగు ప్రేక్షకులకు చిత్ర కాస్త ఆశనిచ్చింది. ఆమె రీల్స్ చూస్తూ తెలుగు ఆడియెన్స్ సౌందర్యను చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. సౌందర్య లేని లోటును చిత్రతో పూడ్చుకుంటున్నారు. ఇక చిత్రా కూడా.. సౌందర్య లేకపోయినా.. మీ జూనియర్ సౌందర్య ఉందంటూ.. మీ అభిమానాన్ని ఆ సౌందర్య.. ఈ సౌందర్య ఎప్పటికీ మరవదంటూ అలరిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here