మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఇరువురి హీరోల కుటుంబాల మధ్య బాక్స్ ఆఫీస్ పోరు గత నాలుగు దశాబ్దాల నుండి ఉంది. ఇంత పోరు ఉన్నప్పటికీ నేటి తరం స్టార్ హీరోలు గా పిలవబడే ఈ ఇద్దరు హీరోలు క్లోజ్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక వీళ్లిద్దరు కలిసి #RRR చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడమే కాకుండా, పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకొని ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. అంతే కాకుండా కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో కూడా ఈ సినిమా ఆరు క్యాటగిరీస్ లో అవార్డులను గెల్చుకుంది.

ఇది ఇలా ఉండగా గత కొంత కాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ ని ఒక విలేఖరి కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిల్లో మూడు సంవత్సరాలు మీరు రామ్ చరణ్ తో కలిసి పని చేసారు కదా, ఆయనలో మీకు నచ్చిన విషయం ఏమిటి, అలాగే నచ్చని విషయం ఏమిటి అని అని యాంకర్ అడుగుతుంది. దానికి ఎన్టీఆర్ సమాధానం చెప్తూ ‘ ఎలాంటి పరిస్థితి ఎదురైనా రామ్ చరణ్ చాలా సెటిల్ గా ఉంటాడు, అది నాకు ఎంతో ఇష్టం.

అతనిలో నచ్చని విషయం కూడా అదే, ఎంత బాధని అయినా తనలోనే దాచుకుంటాడు. స్నేహితులం మేము ఉన్నాము , మాతో పంచుకోవచ్చు కదా,అదే నాకు నచ్చదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కోసం దుబాయ్ కి వెళ్ళాడు. #RRR చిత్రం కి గాను ఉత్తమ నటుడి క్యాటగిరీ లో ఎన్టీఆర్ కి అవార్డు వచ్చింది. అందుకోసమే ఆయన వెళ్ళాడు.