వామ్మో.. ఎన్టీఆర్ నెలకు ఇంత సంపాదిస్తున్నాడా..

- Advertisement -

ఒక్కో సినిమాకి తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మధ్యనే “ఆర్ఆర్ఆర్” సినిమాతో ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద స్టార్ గా మారిపోయారు. ఇక టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. గొప్ప న‌టుడిగా కాకుండా మంచి డ్యాన్స‌ర్ గా గుర్తింపు సంపాదించుకుని కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఎన్టీఆర్(NTR) అంటే పేరు బ్రాండ్ అనేట్లుగా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ఈ నంద‌మూరి బుల్లోడి 40వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 70 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చూసుకుంటే సుమారు 571 కోట్లు అని తెలుస్తోంది. ఇక నెలకి ఎన్టీఆర్ 3 కోట్ల దాకా సంపాదిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సినిమాల పరంగా కూడా ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. ఒక్కో సినిమాకి ఎన్టీఆర్ 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కానీ “అర్ఆర్ఆర్” సినిమాకి ఎన్టీఆర్ ఏకంగా 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

NTR Family

ప్రస్తుతం ఒక్కో సినిమా కి తారక్ 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో 25 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. హైదరాబాద్ లో మాత్రమే కాక బెంగళూరులో కూడా ఎన్టీఆర్ కి బాగానే ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా ఎన్టీఆర్ వద్ద లాంబోర్గిని, రేంజ్ రోవర్, పోర్షే, మెర్సిడెస్ బెంజ్, వంటి కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here