JR NTR పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో.. బుడ్డోడు భలే ఉన్నాడు

jr ntr


JR NTR దీపావళి సెలబ్రేషన్‌ ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. ఆ ఫొటోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఎన్టీఆర్ పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేసే ఎన్టీఆర్.. బయట కన్పించడం చాలా అరుదు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ చరణ్ దీపావళి సెలబ్రేషన్స్ లో కుటుంబంతో కలిసి యంగ్ టైగర్ పాల్గొన్నారు.

JR NTR
JR NTR

రామ్ చరణ్ నిర్వహించిన ఈ పార్టీలో తారక్‌ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో తన భార్య లక్ష్మి ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ పిక్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా.. అది వైరల్‌ అవుతుంది. ఇందులో తారక్‌ కుర్తా ధరించారు. పిల్లలు అభయ్‌, భార్గవ్‌ సైతం అలాంటి డ్రెస్‌ వేసుకున్నారు. సారీలో లక్ష్మి ప్రణతి మెరిసిపోతుంది. ఇద్దరు ఎంతో క్యూట్‌గా ఉన్నారు. అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్‌ రామ్‌ ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. అచ్చు తారక్‌ని దించేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఫ్యామిలీ పిక్ చూసి ఫ్యాన్స్ ఖుషి చేస్తుంది.


ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ఇది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బీ టౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. రెండు భాగాలుగా నిర్మించే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో దీన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.