Actress Kasthuri : బికినీ ఫొటో పంపినా హీరోయిన్ ఛాన్స్ రాలే.. ఓపెన్ అయిన నటి కస్తూరి

- Advertisement -

Actress Kasthuri : నటి కస్తూరి చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడైతే కస్తూరి బుల్లితెరపై నటిస్తోంది కానీ ఒకప్పుడు ఆమె స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. భారతీయుడు, అన్నయ్య లాంటి చిత్రాల్లో నటించి మెప్పించడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు. గృహలక్ష్మి సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది. యాభై ఏళ్ల వయసులో ఇన్ స్టా రీల్స్, హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

Actress kasthuri
Actress kasthuri

కస్తూరి ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడేందుకు వెనకడుగు వేయదు. వివాదాస్పద అంశాలపై కూడా ఆమె స్టాండ్ తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్ ని గుర్తుచేసుకుంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.స్టార్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శంకర్ లతో వర్క్ చేయడం గురించి కస్తూరి ఓపెన్ అయ్యింది.

భారతీయుడు మూవీలో ఫస్ట్ తనను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారంట. ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని బికినీ ఫొటోలు కూడా పంపిందంట. అయితే ఆ టైంలో రంగీలా మూవీ రిలీజ్ ఉండటంతో.. ఊర్వశికి క్రేజ్ ఉండేదంట. దీంతో అటెన్షన్ ఆమె వైపు వెళ్ళి.. చివరికి ఊర్మిళ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారంట. కానీ కస్తూరికి కమల్ చెల్లి పాత్ర ఇచ్చారు. ఏంటి ఇలా చేశారని శంకర్ ని అడిగానని చెప్పుకొచ్చింది ఈ ముదురు భామ.

- Advertisement -
kasthuri half saree photos

భారతీయుడు మూవీలో కస్తూరిదే కీలకమైన పాత్ర అని చెప్పడంతో ఒప్పుకున్నట్లు ఆమె తెలిపింది. ఇక అన్నమయ్య చిత్రం గురించి చెబుతూ.. నాగార్జున తనకు తొలి రోజు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఇంటికి వెళ్లెవరకూ హ్యాండ్ వాష్ చేసుకోలేదు అని చెప్పింది ఈ బ్యూటీ.

తను ఎప్పుడూ గ్లామర్ గానే ఉండాలనుకుంటానంది కస్తూరి. కానీ గృహలక్ష్మి సీరియల్ వల్ల తెలుగులో రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో వ్యక్తిగా మారిపోయానంది. ఒకసారి పబ్ లో వాష్ రూమ్ కి వెళితే.. అక్కడ క్లీనింగ్ చేసే మహిళలు తనను చుట్టుముట్టేశారంట. గృహలక్ష్మి తులసి అంటూ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వాళ్లు చూపించిన ఆప్యాయత అంతా ఇంతా కాదు అని కస్తూరి తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here