Jr NTR : స్వర్గీయ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కి హీరోగా వచ్చే పారితోషకంతో పాటు తాత వారసత్వంగా కూడా పలు ఆస్తులు వచ్చి పడ్డాయి.

జూనియర్ ఎన్టీఆర్ చాలా చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశారు. అతి తక్కువ సమయంలోనే మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన టాలీవుడ్ యంగ్ టైగర్ గా దూసుకుపోతున్నారు. నందమూరి హీరోలలో అత్యధిక ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో కూడా ఈయనే.. ప్రస్తుతం తన 30 వ సినిమాతో బిజీ కాబోతున్నాడు. డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, యాంకరింగ్ పరంగా కూడా సత్తా చాటిన ఈయన ఇప్పుడు లైఫ్ స్టైల్ లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
1983 మే 20వ తేదీన హరికృష్ణ – శాలిని దంపతులకు జన్మించిన ఈయన 1991లో మొదటిసారి తాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర హిందీ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి సినిమాతోనే తాత ఎన్టీఆర్ తో పాటు బాబాయ్ బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాకపోవడమే విషాదకరం . ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో నటించాడు.

ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా మారి ఇప్పుడు 29 సినిమాలు పూర్తి చేశాడు. సినిమాలలో ఉంటూనే రూ.440 కోట్ల వరకు ఆస్తులు సంపాదించిన ఈయనకి.. నిమ్మకూరు నుంచి ఐదెకరాల పొలం వారసత్వంగా సంక్రమించింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం దీని విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయాన్ని జూనియర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక మీడియా సమావేశంలో గుర్తు చేశారు.