Guess The Actor : ప్రతీ హీరో కి ఎదో ఒక సినిమా ల్యాండ్ మార్కుగా ఉంటుంది, అలాగే ప్రభాస్ కెరీర్ లో కూడా ల్యాండ్ మార్క్ లాంటి సినిమా ఏమిటి అని అడిగితే కళ్ళు మూసుకొని ‘వర్షం’ సినిమా పేరు చెప్పొచ్చు.అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరోగా మాత్రమే కొనసాగిన ప్రభాస్, ఈ సినిమా తో స్టార్ హీరో గా ఎదిగాడు.ఈ చిత్రం లో పనిచేసిన ప్రతీ ఒక్కరు ఇప్పుడు టాప్ స్థానం లో ఉన్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా నటించిన బాలనటుడు అక్షయ్ బచ్చు గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.చూసేందుకు ఎంతో క్యూట్ గా కనిపించే ఈ కుర్రాడి మొదటి సినిమా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సంతోషం’ అనే చిత్రం.ఈ సినిమాలో నాగార్జున కొడుకుగా అక్షయ్ బచ్చు ఎంతో చక్కగా నటించి లక్షలాది మంది ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు.
ఆ సినిమా తర్వాత వెంటనే ఇతగాడికి ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమా కూడా పెద్ద సూపర్ హిట్ అవ్వడం తో ఇక అక్షయ్ కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి కానీ, అతను తన ప్రధాన ద్రుష్టి హిందీ సినిమాలపైనే చూపించాడు. అక్కడ డజనుకు పైగా సినిమాల్లో నటించి, ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.
ఈయన గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతగాడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
మన తెలుగు ఆడియన్స్ కి ఇతను ఇప్పటికీ చైల్డ్ ఆర్టిస్టు గానే పరిచయం. అలాంటి అక్షయ్ ఇప్పుడు పెద్ద వాడై మంచి మ్యాచో మ్యాన్ లుక్స్ తో కనిపించడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఆయనకీ సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.