Actor Jitin : ‘నీ స్నేహం’ చిత్రం లో ఉదయకిరణ్ స్నేహితుడిగా నటించిన ఇతను ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో తెలుసా?

- Advertisement -

Actor Jitin : టాలీవుడ్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించిన క్యారక్టర్ ఆర్టిస్టులను అంత తేలికగా మరచిపోలేము.చేసింది కేవలం ఒక్క సినిమానే అయినా వాళ్ళని గుర్తుపట్టగలము.ఎందుకంటే వాళ్ళు పోషించిన పాత్రలు వారికి అలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతాయి కాబట్టి.అందుకే సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం అదృష్టం అని అందరూ అంటుంటారు.అలా కేవలం ఒక్క సినిమా తోనే మంచి పాపులారిటీ ని సంపాదించి, ఇప్పుడు చూసిన గుర్తుపట్టగలం అనిపించేంత పాపులారిటీ ని సొంతం చేసుకున్న నటుడు ‘జితిన్’.

Actor Jitin
Actor Jitin

ఉదయ్ కిరణ్ – ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా, మ్యూజిక్ పరంగా కూడా భారీ హిట్ అయ్యింది.ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ కలకాలం గుర్తుండిపోయ్యే అద్భుతమైన పాటలను ఈ సినిమాకి అందించాడు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి స్నేహితుడిగా నటించిన వ్యక్తి జితిన్ ని అంత తేలికగా మర్చిపోలేం.

ఫుట్ బాల్ ఆటగాడైన సినిమా ప్రారంభం లోనే ఒక పాట తర్వాత తన రెండు కాళ్ళను పోగొట్టుకుంటాడు.ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ ని చూసి ప్రేమలో పడుతాడు, అంతకు ముందు నుండే ఆర్తి అగర్వాల్ ని ప్రేమిస్తున్న ఉదయ్ కిరణ్, తన స్నేహితుడు కూడా ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలుసుకొని తన ప్రేమని త్యాగం చెయ్యడానికి సిద్ధం పడుతాడు.అలా మంచి డ్రామా తో కొనసాగే ఈ సినిమా లో ఉదయ్ కిరణ్ ఎంత అద్భుతంగా నటించాడో, జితిన్ కూడా అంతే బాగా నటించాడు.

- Advertisement -
Uday Kiran mOvies

కానీ ఎందుకో ఇతను ఆ సినిమా తర్వాత తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కినా నటించడానికి ఇష్టపడలేదు.ఈయన అంతకు ముందు హిందీ లో పలు సినిమాల్లో హీరో గా నటించాడు.పెద్దగా గుర్తింపు ఏమి రాలేదు, అతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘నీ స్నేహం’ చిత్రం మాత్రమే.గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు లో సినిమాలు ఎందుకు చెయ్యలేదో ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్న.2010 వ సంవత్సరం లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిన జితిన్ కి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయనకీ సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here