Janhvi Kapoor : RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఈ నెల 23 వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వబోతుంది అని మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వడం వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిఓంచబోతున్నట్టు ఇది వరకే మూవీ యూనిట్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు.ఒక్క హిట్ లేకపోయినప్పటికీ కూడా ఈమెకు యూత్ లో అంత క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఆమె అందమే అని చెప్పొచ్చు.ఈమెకి టాలీవుడ్ లో ఇదే మొట్టమొదటి సినిమా కూడా.

ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ తనకి ఎంతో ఇష్టమైన నటుడు అని ఇది వరకే జాన్వీ కపూర్ అనేక సందర్భాలలో అనేక ఇంటర్వ్యూస్ లో తెలిపింది.’ఎన్టీఆర్ తో కలిసి నటించడాన్ని నా అదృష్టం గా భావిస్తున్నాను.ప్రతీ రోజు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటూనే ఉన్నాను.
ఇన్నాళ్లకు నా కల నెరవేరింది,మూవీ ఒప్పుకున్న తర్వాత షూటింగ్ లో ఎప్పుడు పాల్గొనాలి అంటూ డైరెక్టర్ కొరటాల శివకి రోజు మెసేజిలు పెట్టి వేధించేదానిని’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఇదంతా విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో కి పెళ్లి అయిపోయింది, ఆశలు పెట్టుకోవద్దు అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఆమెకి నాలుగు కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తున్నారట నిర్మాతలు.ఇది కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారింది.