Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది.. ఓవైపు సినిమాలలోనే నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది జాన్వి.. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
జాన్వి కపూర్ తన ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. తరచూ తన ఫిట్నెస్ కి సంబంధించిన ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. యోగ, వర్కౌట్స్ చేస్తున్న జాన్వి ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాము. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న జాన్వి ఓ వీడియోను పంచుకుంది. ఉదయం ఉత్తమమైన ఉదయం అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ కూడా జోడించండి..
జాన్వి ఓవైపు వర్కౌట్ చేస్తూనే మరోవైపు టాప్ టు బాటమ్ అందాలని చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. డంబెల్స్ ను అవలీలగా ఎత్తేస్తూ జాన్వి కపూర్ పరువాల జాతర చేస్తోంది. ఈ అందాల సోయగానికి కుర్రాళ్ల మతులు పోత్తున్నాయి.. హాట్ అందాల ప్రదర్శనతో కుర్ర కారు గుండెల్లో సెగలు రేపుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. ఈ భామ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. తన వలపుల విందుతో కర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంది..
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. జాన్వి నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ భారీ పాపులారిటీని ఏర్పరుచుకుంది.. బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న జాన్వి కపూర్ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.