Jagapathi Babu : నిర్మాతని చావబాదిన జగపతి బాబు.. ఆ హీరోయిన్ కోసమేనా!



Jagapathi Babu : టాలీవుడ్ లో మ్యాన్లీ హీరో గా శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరో జగపతి బాబు.. హీరో గా రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన ఈయన, ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోవడం తో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు.. ఇక ఎప్పుడైతే ఆయన నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటించాడో అప్పటి నుండి ఆయన జీవితమే మారిపోయింది.

Jagapathi Babu

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా జగపతిబాబు తన పీక్ కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.. అయితే రీసెంట్ గా జగపతి బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సంచలనంగా మారింది.

Jagapathi babu comments

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఒక ఆయన , ప్రముఖ స్టార్ హీరోయిన్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడట.. ఇందుకు ఆ హీరోయిన్ ఎంతో బాధపడేదట.. ఒకరోజు జగపతి బాబు వద్దకి వచ్చి ఇవన్నీ చెప్పుకొని ఏడ్చేలోపు, జగపతిబాబు నేరుగా అతని వద్దకి వెళ్లి చితకబాదాడట.. ‘మళ్ళీ ఇంకోసారి ఇలా చేశావంటే నిన్ను ఇండస్ట్రీ లో లేకుండా చేస్తాను’ అని కూడా అన్నాడట.

Jagapathi babu attack on producer

విషయాన్నీ స్వయంగా జగపతి బాబు ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో.. ఆ హీరోయిన్ ఎవరో నేరుగా చెప్పలేదు కానీ, సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ హీరోయిన్ ‘రాశి’ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం వాస్తవమే అని, దయచేసి అవకాశాల కోసం ఎవ్వరు కూడా తమ ఆత్మాభిమానం ని చంపుకోవద్దు అంటూ జగపతి బాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.