Jabardasth Varsha : జబర్దస్త్ లోకి వచ్చి బాగా ఫేమస్ అయింది వర్ష.. అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా పాపులర్ కాలేదు.. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పుడప్పుడు హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

పొట్టి డ్రెస్ లో సొగసరి హాట్ ఫొటోషూట్లతోనూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఎర్ర గులాబీని తలపించేలా పోజులిస్తూ ఫొటోలు దిగింది. కేక పుట్టిస్తున్నావంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మోడలింగ్‌తో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు అభిషేకం అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆతర్వాత తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి అడుగపెట్టి ఒక్కసారిగా హైలైట్ అయింది.

ఇక వర్ష మరో జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటోంది. అతనితో కలిసి ఆమె చేసే స్కిట్లు, కామెడీ షోలకు బుల్లితెరపై బాగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక, కొన్ని కార్యక్రమాల్లో వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించి రచ్చ చేశారు.