Jabardasth Avinash కు బన్నీ ఫ్యాన్స్ వార్నింగ్.. ఎందుకంటే?

- Advertisement -

Jabardasth Avinash జబర్దస్త్ షో లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఎన్నో షోలు చేసాడు.. అంతేకాదు పలు సినిమాల్లో కూడా నటించి తన మార్క్ తో జనాలను అల్లరిస్తున్నాడు..అయితే కొన్నిసార్లు మాత్రం ఇమేటేట్ చేస్తూ వివాదాలను తెచ్చుకుంటాడు.. తాజాగా పుష్ప2 లో అల్లు అర్జున్ గెటప్ ను ఇమిటెట్ చేసాడు.. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు.. ఆయన ఫ్యాన్స్ అవినాష్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది..

Jabardasth Avinash
Jabardasth Avinash

ఇంకోసారి ఇలా చేస్తే మాములుగా ఉండదు బిడ్డా పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. ఏంటి గెటప్ వేస్తే ఇంత సీన్ చెయ్యాలా అనుకుంటున్నారుగా.. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్నింగ్ లు ఇవ్వడం సహజంగా జరిగే పనే.. అది సామాన్యులు కావచ్చు. .. సెలబ్రిటీలు కావచ్చు.. తన స్టార్ ను అవమానించినా.. కాంట్రవర్సీమాటలు మాట్లాడినా.. ఎగతాళి చేసినా.. ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్రోల్ చేస్తుంటారు.. తాజాగా ఆ పరిస్థితి ముక్కు అవినాష్ కు వచ్చింది..అతను ఎక్కడ కనిపించిన కొట్టాలని బన్నీ ఫ్యాన్స్ చూస్తున్నారని టాక్..

avinash

తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా.. పుష్ప2 నుంచి టీజర్ తో పాటుగా.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు సుకుమార్ టీమ్. బన్నీ పోస్టర్ టాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియా వ్యాప్తంగా షేక్ చేసేసింది. అమ్మవారి రూపంలో బన్నీ ఊర మాస్ పిక్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. దాన్ని చూసిన ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.. అయితే..ఆ వైరల్ పిక్ ను అవినాష్ అటు ఇటుగా మార్చి, తన ఫోటోతో కలిపి.. ఎడిటింగ్ చేశారు. అంతేకాదు అలా చేయడంతో పాటు తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫోటో పోస్ట్ చేశాడు. అంతే కాదు ఈ ఓన్ మేడ్ పిక్ తో అల్లు అర్జున్ కు బర్త్ డే విషెష్ కూడాచెప్పాడు అవినాష్… అదే పిచ్చి అవినాష్ పీకల మీదకు తెచ్చింది..దాన్ని చూసిన ఫ్యాన్స్ వెంటనే డిలీట్ చెయ్యి, లేకుంటే నీకు మాములుగా ఉండదు.. మమ్మల్ని ఇర్రిటేట్ చెయ్యకు బిడ్డ.. బన్నీ చేస్తే గంగమ్మ తల్లిలాగా ఉంది.. నువ్వు వేస్తే పక్కంటి మంగమ్మలా ఉందంటూ కామెంట్స్ చేశారు..మరి దీనికి అవినాష్ ఎలా రియాక్ట్ అవుతాడో.. బన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి..ప్రస్తుతం అవినాష్ పలు షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here