Jabardasth Naresh : జబర్దస్త్ షోలో కమెడియన్ పొట్టి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన హైటుకు తగ్గట్లు పంచులతో.. కామెడీ డైలాగ్స్‌తో స్కిట్‌లు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ నరేష్ చిన్న పిల్లాడిలా కనిపించినప్పటికీ నిజానికి అతడి వయసు 25 ఏళ్లు. జబర్దస్త్ నరేష్ కొన్నాళ్లుగా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. తనపై తోటి కమెడియన్లు ఎలాంటి పంచులు వేసినా పాజిటివ్‌గా తీసుకునేవారు.

ఎక్కువగా నరేష్ పెళ్లి, ప్రేమ వ్యవహారాలపై స్కిట్ లు వచ్చేవి.. కానీ నిజ జీవితంలో మాత్రం తాను అన్నింట్లోనూ తక్కువ వాడిని కాదని నిరూపించుకున్నాడు. ఇన్నాళ్లుగా దాచిపెట్టిన సీక్రెట్ బయటపెట్టాడు నరేష్.. తనకు కూడా ఓ లవర్ ఉన్నాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.. మొన్నటి వరకు తన ప్రేమను గోప్యంగా ఉంచి చివరకు ఇప్పుడు బయటపెడుతున్నాడు.
ఈ మేరకు జబర్దస్త్ నరేష్ తన ప్రేమికులరాలిని ఓ షోలో అందరి ముందు పరిచయం చేశాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన స్నేహితురాలిని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు… ఈ విషయం చెప్పడానికి ఆమె చాలా ఆత్రుతగా ఉందని చెబుతూనే ఆమెను వేదికపైకి ఆహ్వానించాడు. వేదిక పైన లవ్ డ్యూయెట్లు కూడా చేశారు. వారిద్దరూ రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలియజేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.