మొత్తానికి భార్యని చూపించి.. వివరాలు చెప్పిన కెవ్వు కార్తిక్.. ఏంది భయ్య ఇంత అందంగా ఉంది

- Advertisement -

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాడు. తనకు పెళ్లి సెట్ అయిందని పోస్ట్ వేశాడు. తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్వర్గంలో పెళ్లిళ్లు నిశ్చయించబడతాయని అంటుంటే ఇన్నాళ్లు నమ్మలేదు గానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తోందంటూ ఇలా తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు.రెండు విభిన్న మనస్తత్వాలు, భిన్న జీవితాలు, వేర్వేరు ఆలోచనలు, వేర్వేరు ప్రపంచాలు ఇప్పుడు కలిసిపోయాయి.. ఒకే జీవితాన్ని ప్రారంభించబోతోన్నాం.. అంటూ ఇలా తన భార్యను పరిచయం చేశాడు కెవ్వు కార్తీక్.

కెవ్వు కార్తిక్
కెవ్వు కార్తిక్

తాజాగా తనతో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశాడు. అమ్మాయి పేరు సిరి అని మాత్రమే చెప్పాడు. మిగతా వివరాలు ఏవీ బయటకు వెల్లడించలేదు. “పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నాను. కానీ. ఆ సమయంలో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. రెండు భిన్నమైన ఆత్మలు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు, జీవిత ప్రయాణ పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి. నా జీవితానికి స్వాగతం సిరి” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.

అంతకు ముందు పోస్టులో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన కెవ్వు కార్తిక్. అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ “మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వస్తే, జీవితం మరింత అందంగా, హ్యాపీగా ఉంటుందని కొందరు చెప్పారు. బహుశా అది ఇదేనేమో” అంటూ రాసుకు వచ్చాడు. తన జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్స్ అని చెబుతూనే, నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here