ఇక్కడ పొమ్మన్నారని.. అక్కడ వెతుక్కుంది.. ఈ హీరోయిన్ బాగా తెలివైంది గురూ..

- Advertisement -

మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. చూడచక్కని రూపం. విశాలమైన కళ్ళ తో ఆకట్టుకుంది అను. ఇక మజ్ను సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు.

అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.రీసెంట్ గా అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఆ క్రెడిట్ ఈ అమ్మడి ఖాతాలో పడలేదు.అయితే ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తెలుగులో అనుకున్న రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయిన అను. తమిళ పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఈ అమ్మడు అక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది. కార్తీ సరసన జపాన్ లో అను హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమ్మడి అందం, నటన అక్కడి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ్ లో మరో సినిమా చేసే ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అదికూడా కార్తీ సినిమాలోనే అని టాక్. 96 ఫేం ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అయ్యితే అను తమిళ్ లో బిజీకావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here