Anchor Sowmya : నీది చిన్నగా ఉంది.. పెంచుకొని రా మేనేజ్ చేద్దాం.. ఆవేదనతో జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు

- Advertisement -


Anchor Sowmya : ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో వల్ల కొందరు హాట్ భామలు యాంకర్లుగా బుల్లితెరకు పరిచయమయ్యారు. బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన కమెడియన్లు ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి వెళ్లారు. రష్మీ, అనసూయలాంటి వాళ్లు కొన్నాళ్లు ఆ షోను ఏలేశారు. వాళ్లకు ఈ షో వల్లే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. పలు సినిమాల్లో మెయిన్ లీడ్ పోషిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారి తర్వాత ఆ స్థానంలోకి సౌమ్య రావు వచ్చింది. తను ‘జబర్దస్త్’లో యాంకర్‌గా చేసింది కొన్నిరోజులే అయినా.. ప్రస్తుతం తనకంటూ బుల్లితెర ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు దక్కించుకుంది.

Anchor Sowmya
Anchor Sowmya

అయితే యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పుడు తనకు ఎదురైన నెగిటివిటీ గురించి బయటపెట్టింది. తన గురించి దరిద్రంగా మాట్లాడేవారని, పాత యాంకర్లకు సమానంగా చేయాలని కష్టపడేదాన్నంటూ చెప్పుకొచ్చింది. కొంతమంది ఆడియన్స్ నన్ను యాంకర్‌గా ఒప్పుకున్నారు. కొందరు ఒప్పుకోలేదు. కొంతమంది బాగుంది, మాకు నచ్చింది అన్నారు. నా తెలుగును వాళ్లు ఎంజాయ్ చేస్తారు.

ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా.. దానిని కొందరు ఎంజాయ్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాకుండా ఎందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, దరిద్రంగా ఉంది, అసహ్యంగా ఉంది, చూడడానికి బాలేదు, మంచి అమ్మాయిలు ఉన్నారు తెలుగులో అని తిడతారు. ఒక దేవుడినే అందరూ పూజించరు. నేను మామూలు మనిషినే కదా. కొంతమంది ఎక్కడికి వెళ్లినా గుర్తిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. కొందరు మాత్రం తెలుగు రాదు అని చెడుగా మాట్లాడతారు. వాళ్లని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియదంటూ సౌమ్య రావు చెప్పుకొచ్చింది.

- Advertisement -

పాత యాంకర్లకు 11,12 ఏళ్లు అనుభవం ఉంది. నాకు 6,7 నెలలు మాత్రమే అనుభవం ఉంది. చాలా తేడా ఉంది కదా. వాళ్లు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. నేను డ్యాన్స్‌లో చాలా డల్. నాకు డ్యాన్స్ అస్సలు రాదు. డ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. కానీ నేను అసలే సన్నగా ఉంటాను. ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా సన్నగా అయిపోతున్నా.. దీంతో జబర్దస్త్ డైరెక్టర్ నన్ను.. నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకు. ఇంకా సన్నగా అయితే అస్సలు బాగుండవు. బాగా తిని బాడీ పెంచు. డ్యాన్స్ ఏదోలా మేనేజ్ చేయండన్నారు. నాలోని పలు లోపాల వల్ల జబర్దస్త్ ను వదిలేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సౌమ్య రావు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here