Emmanuel : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్‌తో గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతో మందిని కడుపుబ్బా నవ్విస్తూ.. ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. అలాగే కొందరు సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ వెండి తెరపై కూడా తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షో వల్ల మంచి గుర్తింపు సంపాదించుకున్న జాబితాలో ఇమ్మానుయేల్, వర్ష కూడా ఉన్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో సార్లు స్టేజీపై మాట్లాడడంతో వారి ఫెయిర్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
దీంతో వాళ్లు లవ్ ట్రాక్ కొనసాగిస్తూనే పలు షోలను చేస్తూనే ఉన్నారు. ఇటీవల వీరిద్దరు కలిసి ప్రేమ కావాలి షోలో యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రేమ కావాలి షోకు.. లంబసింగి చిత్రబృందం వచ్చింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్గా నటించిన బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య వచ్చింది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ వచ్చి దివిని చూసి సిగ్గుపడుతూ నువ్వే నా క్రష్ అని అంటాడు. చాలా కాలం నుంచి తనను ఇష్టపడుతున్నానని అని చెప్తాడు. దానికి హీరోయిన్ దివి నవ్వుతూ సరదాగా కొడుతూ మెలికలు తిరిగిపోయింది. ఇక ఆ తర్వాత వర్ష ప్రేమించడంలో అమ్మాయిలు గొప్ప.. అబ్బాయిలు గొప్ప అని అడగగా.. వీరిద్దరూ కలిసి చక్కగా ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ ఎదగడం గొప్ప అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత స్టూడెంట్స్‌కు టాస్కులు ఇచ్చారు. ప్రోమో చివరిలో దివి ప్రేమ గురించి చెప్పి అందరిని షాక్ కు గురి చేసింది. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నేను నీతో బతకాలి అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందాం. నువ్వెలా ఉన్నా ఫర్లేదు నేను నిన్ను చూస్తుంటాను ఐ లవ్ యూ. నీ క్కూడా ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఇవన్నీ ఇమ్మాన్యుయేల్ కోసం చెప్పిందా.. సినిమాలోని డైలాగా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయం తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యే దాక వేచి చూడాల్సిందే.