Singer Mangli : రోడ్డు ప్రమాదంలో స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు.. ఆందోళనలో అభిమానులు

- Advertisement -

Singer Mangli : జానపద గాయనిగా స్టార్ డమ్ సాధించి.. ప్రస్తుతం స్టార్ సింగర్ గా దూసుకెళ్తోంది మంగ్లీ. టీవీ షోల నుంచి మొదలైంది ఆమె పాటల ప్రయాణం. ప్రజెంట్ తానో మోస్ట్ వాంటెడ్ సింగర్. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. అది ఫోక్ సాంగ్ అయినా సరే.. ఐటెం సాంగ్ ఐనా సరే మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకులు థియేటర్లలో కేరింతలతో ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ అయిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఆమె కారును ఓ డీసీఎం వాహనం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి కారణం డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే అని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉంటే ఆమె ప్రయాణిస్తున్న కారుకు భారీగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మంగ్లీ ప్రస్తుతం సూపర్ సింగర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. దాంతో పాటు పలు ప్రైవేట్, సినిమా పాటలు పాడుతూ ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటుంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here