Isha Koppikar : ప్రముఖ నటి ఇషా కొప్పికర్ తెలిసే ఉంటుంది. ఆమె నాలుగైదు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. నాగార్జున సరసన నటించిన చంద్రలేఖ సినిమా ఆమె కెరీర్‌లో మెమరబుల్ మూవీ. ఆ సినిమాలోని పాటలు అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆ సినిమాలో ఇషా కొప్పికర్ గ్లామర్‌గా కనిపించి కుర్రాళ్లకు కవ్వించింది. కొన్నేళ్ల క్రితం వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ జనాలకు నచ్చుతూనే ఉంది.

అయితే 2009లో ఇషా కొప్పికర్‌కు రెస్టారెంట్ యజమాని టిమ్మీ నారంగ్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే గత కొంత కాలంగా ఇషా కొప్పికర్, టిమ్మి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు సహజీవనం చేసిన దంపతుల మధ్య అనుకోని విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భర్తతో నిత్యం గొడవలు తట్టుకోలేక ఇషా కొప్పికర్ తన కూతురుతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

దీనిపై నేరుగా విడాకుల ప్రస్తావన లేకుండా మీడియా ప్రశ్నించగా.. చెప్పేదేమీ లేదు.. మాట్లాడాలని కూడా లేదు. దయచేసి ఎవరినీ ఏమీ అడగవద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ బదులిచ్చింది. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.