Barrelakka Sirisha : బిగ్ బాస్ ఓటీటీ 2 లో కంటెస్టెంట్ గా ‘బర్రెలక్క’ శిరీష.. మిగిలిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

- Advertisement -

Barrelakka Sirisha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పాపులర్ రాజకీయ నాయకుల కంటే మన అందరికీ బాగా వినిపించిన పేరు బర్రెలక్క శిరీష. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని ఈమె తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పాలి. నాగర్ కర్నూల్ నుండి పోటీ చేసిన బర్రెలక్క కి వచ్చిన ఆరు వేల ఓట్లు మాత్రమే. కానీ ఆమె ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద చాలా బలంగా పడింది.

Barrelakka Sirisha
Barrelakka Sirisha

ఒక సామాన్యురాలిగా ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ పదికాలాలు అందరికీ గుర్తుండిపోతుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈమె బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. త్వరలోనే హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రెండవ సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో పాల్గొనాల్సిందిగా రీసెంట్ గానే బిగ్ బాస్ నిర్వాహకులు బర్రెలక్క ని కలిశారట.

Sirisha

ఆమె కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ద్వారా కోట్లాది మంది ప్రజలకు మరింత చేరువ అయితే రాజకీయంగా నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఆమె అలోచించి ఉండొచ్చు. ఆమెతో పాటుగా పలువురి పేర్లు సోషల్ మీడియా లో బాగా వినిపిస్తుంది. సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి, ఆడియన్స్ కి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించిన భోలే ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అట.

- Advertisement -
Bhole shavali

ఆయనతో పాటు నయనీ పావని, సరిగమప ఫేమ్ పార్వతి , యూట్యూబర్ మొయిన్ భాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా టేస్టీ తేజా, శుభ శ్రీ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనుంది. ఈ సీజన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here