Vijay devarakonda: విజయ్ దేవరకొండా ఏమి చేసినా కూడా సోషల్ మీడియా ట్రోల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అతని మీద వస్తున్నా ట్రోల్స్ ఏంటంటే… అతని ఫైనాన్సియల్ స్టేటస్ మీద ట్విట్టర్ లో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ లో విజయ్ మాట్లాడుతూ… పెళ్లిచూపులు మూవీ హిట్ కావడానికి ముందు తన కార్, బైక్ ట్యాంక్ ఎప్పుడూ ఫుల్ కొట్టించలేదని, ఎప్పుడు ఫ్యూయల్ ఇండికేటర్ రెడ్ లోనే ఉండేదని చెప్పాడు. ప్రతి మూవీ రిలీజ్ కు ముందు విజయ్ ఇలా తాను బాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని, మిడిల్ క్లాస్ వాడినని చెప్తూ ఉంటాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది.
అయితే ఇప్పుడు అందరు కూడా సినిమాల్లోకి రావడానికి ముందు విజయ్ ఫైనాన్సియల్ స్టేటస్ ఏంటని చర్చ జరుగుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లలో వాళ్ళ గ్రాండ్ ఫాథర్స్ చాలా భూములు ఉండేవని చెప్పాడు, ఆలాగే వాళ్ళ మదర్ కూడా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… వాళ్ళు దొరసానులని చెప్తారు. ఇంత డబ్బు, ఇంత ల్యాండ్ ఉన్న విజయ్ ఎందుకు ప్రతిసారి తానూ మిడిల్ క్లాస్ వాడినని ఎందుకు చెప్పుకుంటాడని ట్రోల్స్ వస్తున్నాయి.
అలాగే విజయ్ ఫాదర్ ఒక సీరియల్ డైరెక్టర్ అంటే ఇండస్ట్రీలో ఎంతో కొంత కనెక్షన్ ఉంటాయి. కానీ విజయ్ మాత్రం ఎప్పుడూ తనకు బ్యాక్గ్రౌండ్ లేదని చెప్తూ ఉంటాడు. అయితే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేవాళ్లకు ఈ మాత్రం కనెక్షన్స్ కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు విజయ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ స్టేటస్ లో ఉన్నాడు ఇంకా తాను మిడిల్ క్లాస్ వాడినని, తనకు ఇండస్ట్రీలో సపోర్ట్ లేదని చెప్పడం అంత వ్యాలిడ్ అనిపించదు. సో విజయ్ ఇక నుండైనా ఈ మిడిల్ క్లాస్, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని చెప్పే స్టోరీస్ ఆపితే మంచిదని సోషల్ మీడియాలో అంటున్నారు.