అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చినా.. సాయి పల్లవి సంపాదించింది ఇంతేనా..?

- Advertisement -

హీరోల్లో పవన్ కల్యాణ్.. హీరోయిన్స్లో సాయి పల్లవి.. సాయి పల్లవి ఓ లేడీ పవన్ కల్యాణ్.. ఇవి సెన్సేషనల్ పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ అన్న మాటలు. అవును ఇది నిజమే. సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ అలాంటింది. ఓవైపు మెగాస్టార్.. మరోవైపు సాయి పల్లవి ఒకే ఈవెంట్లో కనిపిస్తే.. మెగాస్టార్ కంటే కూడా ఈ బ్యూటీకే జనం చప్పట్లు ఎక్కువగా కొట్టేది. ఆ రేంజ్లో పాపులారిటీ సంపాదించి ఈ అమ్మడు.

సాయి పల్లవి
సాయి పల్లవి

మలయాళీ కుట్టిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సినిమాపై ఉన్న ప్రేమతో తెలుగు భాషను నేర్చుకుంది. తెలుగు హీరోయిన్ల కంటే చక్కగా ఈ బ్యూటీ తెలుగు మాట్లాడగలదు. తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఎక్కువగా మేకప్ వేసుకోదు.. అసభ్యకరమైన డ్రెస్సింగ్ ఇష్టపడదు.. లిప్ లాకులు గట్రా వాటి జోలికి పోదు. చేసే ప్రతి సినిమాలో ప్రతి పాత్ర మన పక్కింటి అమ్మాయే అనిపించేలా చేస్తుంది. అందుకే ఈ భామకు మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్.

ఈ బ్యూటీ ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ అలాంటి ఇలాంటి ఎంట్రీ కాదు బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ ఎంట్రీ అది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అలరించింది. ఫిదా తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. అలాగని వచ్చిన ప్రతి సినిమానూ చేసేయలేదు. తనకు నచ్చిన కథలనే మాత్రమే ఎంచుకుని తనలోని నటిని మెరుగుపరిచే సినిమాల్లో నటించింది.

- Advertisement -
sai pallavi

అలా ఈ 12 ఏళ్లలో ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, పడిపడిలేచే వయసు, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం సినిమాలతో టాలీవుడ్లో దూసుకెళ్లిపోయింది. అయితే ఈ 12 ఏళ్లలో ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్లు కూడా బాగానే ఇచ్చింది. కానీ ఈ భామ సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా కేవలం రూ.25 కోట్లు. సినిమాకు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే ఈ భామ ఎక్కువగా లగ్జరీని ఇష్టపడదు. లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు చేయదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ బ్యూటీ.. వ్యాపార ప్రకటనలకు కూడా దూరంగా ఉంటుంది. అందుకే 12 ఏళ్ల సినిమా కెరీర్లో తన సంపాదన రూ.25 కోట్లు మాత్రమే ఉంది.

మరి ప్రేక్షకుల్లో ఇంత క్రేజ్‌ ఉన్నా సాయి పల్లవి ఏ వ్యాపార ప్రకటనలో ఎందుకు కనిపించలేదు? అనే సందేహం చాలామందికి రావొచ్చు. దానికి ఇలా సమాధానం చెబుతుందామె.. ‘‘వాణిజ్య ప్రకటనలో నటించడం నాకు ఇష్టం లేదు. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలైతే పారితోషికం తీసుకోకుండా చేశాను. అది చాలా తక్కువ మందికి తెలుసు’’ అని చెప్పుకొస్తుంది సాయి పల్లవి. ఇంత సింప్లిసిటీ ఉన్న బ్యూటీని ఎక్కడా చూసుండరు కదా.

ఎనీవేస్ సాయి పల్లవి లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం… హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com