చీరకట్టులో హెబ్బా పటేల్.. ట్రెడిషనల్ లుక్లో నీ అందం అదిరిందబ్బా

- Advertisement -

నా పేరు కుమారి.. నా వయసు 21.. అంటూ హెబ్బా పటేల్ రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ల హృదయాల్లో తిష్ట వేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ గ్లామర్కు, గ్రామర్కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ఈ భామ చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్లో హెబ్బా పేరు మార్మోగింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. కానీ సడెన్గా హెబ్బ ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయింది. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడం షురూ అయింది. క్రమంగా ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది.

హెబ్బా పటేల్
హెబ్బా పటేల్

ఇటీవల మళ్లీ హెబ్బ స్పీడ్ పెంచింది. ఇంతకుముందు గ్లామర్ను మాత్రమే నమ్ముకున్న హెబ్బ ఇప్పుడు తనలోని టాలెంట్కు పని చెప్పింది. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలకు జై కొడుతూ తనలోని నటనతో అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ వ్యవస్థ అనే ఓ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హెబ్బా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ పలికించిన హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హెబ్బాలో ఇంత టాలెంట్ ఉందని ఊహించలేదని సర్ ప్రైజ్ అయ్యారు.

సోషల్ మీడియాలోనూ హెబ్బ చాలా పాపులర్. ఈ బ్యూటీ సినిమాలు చేయనప్పుడు కూడా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యేది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరించేది. అయితే హెబ్బ ఎక్కువగా ట్రెండీ, బోల్డ్ అవుట్ ఫిట్స్లో కనువిందు చేస్తుంది. కానీ తాజాగా వ్యవస్థ మూవీ ప్రమోషన్స్లో బాగంగా ఎక్కువగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్లో కనిపిస్తోంది.

- Advertisement -

తాజాగా ఈ బ్యూటీ క్రీమ్ కలర్ చీరలో సందడి చేసింది. తలలో మల్లెపూలు.. నుదుటిన బొట్టు.. నిండైనకట్టుతో అచ్చతెలుగు పదహారణాల పడుచులా కనిపించి ఆశ్చర్యపరించింది. చీరకట్టులో హెబ్బాను చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

హెబ్బా.. చీరకట్టులో నీ అందం ఏముందబ్బా అంటూ సోషల్ మీడియా లో కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ట్రెండీగానే కాదు ట్రెడిషనల్గానూ హెబ్బా సూపరెహే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్న కుర్రాళ్లు హార్ట్ ఎమోజీస్తో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here