సునిశిత్ అందుకే ఉపాసనపై అలా కామెంట్ చేశాడా..అసలు నిజం ఇదే?

- Advertisement -

మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాదు ఆస్కార్ అందుకొని గ్లోబల్ స్టార్ అయ్యాడు.. దీంతో చరణ్ కు ఇండియాలో ఫ్యాన్స్ పెరిగారు..ఇక తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కు మెగా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. సాధారణంగానే అభిమానులు వాళ్ళ హీరోలని, హీరో ఫ్యామిలీల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోరు. ఏదో ఒక విధంగా విమర్శించడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం లాంటివి చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి చరణ్ భార్య ఉపాసన గురించి తప్పుగా మాట్లాడటంతో చరణ్ ఫ్యాన్స్ అతన్ని దారుణంగా కొట్టినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

సునిషిత్
సునిషిత్

సునిషిత్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ హీరో నాకు తెలుసు, నా సినిమాను ఆ హీరో లాక్కున్నాడు, ఆ హీరో నా వల్లే స్టార్ అయ్యాడు, ఆ హీరోయిన్ తో నాకు అఫైర్ ఉంది.. ఇలా తాను ఓ పెద్ద హీరోలాగా ఫీలయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు సునిషిత్. గతంలో ఇలాగే లావణ్య త్రిపాఠి మీద వ్యాఖ్యలు చేయడంతో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అయినా అతని బుద్ది మారకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో చరణ్ గురించి, ఉపాసన గురించి తప్పుగా మాట్లాడాడు. ఉపాసనపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఇవి వైరల్ గా మారడంతో చరణ్ అభిమానులు కొంతమంది శనివారం నాడు సునిషిత్ ఇంటిపై దాడి చేసి, సునిషిత్ ని చితక్కొట్టారు. అనంతరం అతనిచే చరణ్ కి, ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్ నుంచి సునిషిత్, అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ పై విమర్శలు దారుణంగా వస్తున్నాయి. చరణ్ ఫ్యాన్స్ సునిషిత్ ని కొట్టిన వీడియో కూడా వైరల్ అవుతుంది.. మొత్తానికి అతని చేత ఉపాసన చరణ్ లకు క్షమాపణలు చెప్పించారు.. ఒకసారి ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here