Chiranjeevi కి అసలు ఇష్టం లేని పవన్ కళ్యాణ్ చెత్త సినిమా అదేనా..?

- Advertisement -

Chiranjeevi ప్రతీ హీరోకి అవతల హీరో కి సంబంధించిన ఇష్టమైన సినిమా, ఇష్టం లేని సినిమా ఉంటుంది. అలా మెగాస్టార్ చిరంజీవి కి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమా ఒకటి అసలు నచ్చలేదట. ఈ సినిమాని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ కి చిరంజీవి ఫోన్ చేసి ‘ఏమైంది కళ్యాణ్ నీకు..నీ ఫ్లాప్ సినిమాలకు కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ ఎలాంటి అర్థం పర్థం లేని సినిమా ఇదే.

ఇలాంటి చిత్రాలను ఇంకెప్పుడు చెయ్యకు’ అని అరగంటసేపు చివాట్లు పెట్టాడట. ఆ సినిమా మరేదో కాదు, ‘బంగారం’ చిత్రం. ఈ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ చాలా బాగుండేవి. జానీ కి ముందు వరకు ఆయనకి అన్నీ సూపర్ హిట్స్ పడ్డాయి. జానీ నుండి మొదలైన పవన్ కళ్యాణ్ ఫ్లాపుల జర్నీ ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ వరకు చేరింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన చిత్రమే ‘బంగారం’.

తమిళం లో ఒక్కడు సినిమాని రీమేక్ చేసిన ధరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే చిరంజీవి ఈ చిత్రాన్ని చూసి బాగాలేదు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ‘నాకు స్టోరీ విన్నప్పుడే నచ్చలేదు అన్నయ్య..ఇక డైరెక్టర్ మొహమాటం పెట్టేలోపు చెయ్యాల్సి వచ్చింది’ అని అన్నాడట. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ ప్రాణస్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తాడు.

- Advertisement -

అయితే చిరంజీవి కి నచ్చినా నచ్చకపోయినా ఈ సినిమాని ఆడియన్స్ యావరేజి గా నిలబెట్టారు. ఓపెనింగ్స్ అయితే ఆరోజుల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిల్చింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం డే 1 రికార్డుని నెలకొల్పింది ఈ చిత్రం. అలాగే ఫుల్ రన్ లో కూడా ఈ సినిమాకి దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here