టాలివుడ్ స్టార్ హీరోయిన్ Samantha ఇటీవల అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కాస్త ఆరోగ్యం కుదుటపడి బయట కనిపిస్తోంది.. సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. అయితే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమంత మొక్కు తీర్చుకోవడం కోసం అని పళని మురుగన్ ఆలయంలో ఏకంగా ఏట వాలుగా ఉండే 600 మెట్ల పై కర్పూరం వెలిగించి. అన్ని మెట్లను ఈజీగా ఎక్కేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ మధ్య కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డ సమంత ఏకంగా 600 మెట్లపై చాలా ఓపికగా కర్పూర హారతి వెలిగించడం చూస్తుంటే ఆమె ఆరోగ్యం కుదుట పడిందని తెలుస్తుంది..

ఇదే సమయం లో ఆమె అభిమానులు కొందరు నిన్న మొన్నటి వరకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇప్పటికిప్పుడు ఇంత మొక్కు తీర్చుకోవడం కోసం ఆరు వందల ఏటవాలు మెట్లను ఎక్కడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొంచెమైనా బుద్ది ఉందా అంటూ ఫైర్ అవుతున్నారు.. ఇప్పుడే కదా కోలుకున్నావు.. అప్పుడే అంత పెద్ద పనులు చెయ్యడం అవసరమా అంటూ తిట్టిపొస్తున్నారు. పూర్తిగా ఆరోగ్యం బాగుపడే వరకు వేచి ఉండాలి కదా, కనీసం సంవత్సరం పాటు అయినా పూర్తి విశ్రాంతి అవసరం కదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రోగం కుదరగానే ఇలా చేస్తే ఆ రోగం మళ్ళీ తిరగబెట్టదా అంటూ కొందరు సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు..

ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల చాలా సినిమాలు మిస్ అయినా సమంత ఇప్పుడు ఆరోగ్యం బాగు పడడంతో షూటింగ్స్ కి హాజరు అవ్వాలసి ఉంది. ఇలాంటి మెట్ల పూజలు కర్పూర హారతి అంటూ టఫ్ టాస్క్ చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుంది.. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు హిందీలో సమంత నటించిన వెబ్ సిరీస్ విడుదల అవ్వబోతుంది.. అటు వెబ్ సిరీస్ లు చేస్తుంది.. ఏది ఏమైనా సమంత త్వరగా కోలుకోవడం అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..