Uday Kiran : అప్పట్లో కొంతమంది యంగ్ హీరోల లవ్ స్టోరీ మూవీస్ టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసాయి..ఆ సినిమాలో హీరోలు గా నటించిన యంగ్ హీరోస్ కి కూడా అద్భుతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి హీరోలలో ఒకడు ఉదయ్ కిరణ్. తేజా దర్శకత్వం లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఉదయ్ కిరణ్, ఆ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ వరుసగా ‘నువ్వునేను’, ‘మనసంతా నువ్వే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. అలా అప్పట్లో ఆయన నటించిన ఈ సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ స్టార్ హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లు వచ్చేవి. ఒకానొక దశలో చిరంజీవి మరియు వెంకటేష్ సినిమాలు ఉదయ్ కిరణ్ చిత్రం తో పోటీ పడేందుకు భయపడ్డాయి అట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉదయ్ కిరణ్ కెరీర్ లో ‘మనసంతా నువ్వే’ చిత్రం ఒక మైలురాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. ఒక సింపుల్ స్టోరీ ని చాలా అందంగా, చక్కటి ఎమోషన్స్ తో ఆ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. అయితే ఈ సినిమాని అప్పట్లో సెప్టెంబర్ 6 వ తేదీన విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు. కానీ అదే తేదీన విక్టరీ వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది. బయ్యర్స్ తో అగ్రీమెంట్స్ కూడా అయిపోయాయి. ఒకే రోజున రెండు సినిమాలు విడుదల అయితే మా చిత్రానికి బాగా నష్టం అవుతుంది, ఒక రెండు వారాలు వెనక్కి వెళ్లాల్సిందిగా మనసంతా నువ్వే నిర్మాత ఎంఎస్ రాజు ని అడిగారట. రెండు వారాల తర్వాత మంచి డేట్ అంటే అక్టోబర్ 4 వ తేదీ వస్తుంది.

ఆరోజు మెగాస్టార్ చిరంజీవి దాడి చిత్రం విడుదల. ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏంఎస్ రాజు ని వాయిదా వేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చెయ్యడం తో మనసంతా నువ్వే చిత్రాన్ని మరో రెండు వారాలకు వాయిదా వేసుకొని అక్టోబర్ 19 వ తేదిన విడుదల చేసారు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని హీరో సినిమాతో క్లాష్ పడడం ఇష్టం లేక చిరంజీవి, వెంకటేష్ లాంటి బడా హీరోలు నిర్మాతలు ఉదయకిరణ్ నిర్మాత వద్దకి వచ్చారంటే, అప్పట్లో ఉదయ్ కిరణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.