Anchor Sowmya జబర్దస్త్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మొన్నటివరకు షోలో బూతులు ఎక్కువైయ్యాని వస్తే.. ఈ మధ్య జబర్దస్త్ యాంకర్ల గురించి, జబర్దస్త్ షో గురించి రోజుకో పూకారు బయటకు వస్తుంది.. దాంతో షో రేటింగ్ పూర్తిగా డౌన్ అయ్యింది. షోను చూడటమే మానేస్తున్నారు.. మరో విషయమేంటంటే.. కమెడీయన్లు కూడా ఒక్కొక్కరు షోకు దూరం అవుతున్నారు. జడ్జ్ ల్లో కొందరు విభేదాల కారణంగా వెళితే, మరి కొందరు మరి కొన్ని కారణాల వల్ల వెళుతున్నారు.. ఇక యాంకర్లు కూడా అంతే, జబర్దస్త్ కు కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్య గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతుందని వార్తలు వస్తున్నాయి..

యాంకర్ అనసూయ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్‌ను వదిలేసింది. ఎన్నో రోజుల సస్పెన్స్ తరువాత ఆమె స్థానంలోకి సౌమ్యని తీసుకున్నారు. అనసూయ, రష్మీ ఇద్దరూ జబర్దస్త్ విజయంలో తమవంతు పాత్రను పోషించారు. ఇక సౌమ్య విషయానికి వస్తే వచ్చీరాని తెలుగుతో మోస్తరుగా ఆకట్టుకుంటుంది. వారిద్దరితో పోల్చుకుంటే మాత్రం అంతలేదంటున్నారు వీక్షకులు.

ఇక ఈ అమ్మడు గురించి కూడా నెట్టింట రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సౌమ్యకు పెళ్లి అయ్యిందా లేదా అనే విషయంపై క్లారిటీ అయితే లేదు. కానీ కొందరు పనికట్టుకొని ఆమె తల్లి కాబోతుందని రూమర్లు క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు. అసలు జబర్దస్త్‌ను వదిలేస్తుందా అనేదానిపై కూడా క్లారిటీ లేదు. ఆమె యాంకరింగ్ ఆకట్టుకునేలా లేదని, అందుకే ఆమెను మల్లెమాల టీమ్ తప్పిస్తుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో అనసూయ ఎలాగైతే గర్భవతి అవ్వడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌమ్య కూడా అలానే గ్యాప్ తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె చేస్తున్న షో కూడా యాంకర్ రష్మీ మ్యానేజ్ చేస్తుందని వార్త ప్రచారం చేస్తుంది.. అంతేకాదు మొన్నేమధ్య కొత్త యాంకర్ కూడా వచ్చింది.. ఇందులో ఏది నిజమో మల్లేమాల వారికే తెలుసు.. దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.. మొత్తానికి ఇది మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది..