Malavika Mohan : నక్కతోక తొక్కిన హాట్ బ్యూటీ.. ఏకంగా వెయ్యి కోట్ల సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందిగా

- Advertisement -


Malavika Mohan : ఇటీవల రష్మిక మందన్నా నటించిన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్టు 2 తీయబోతున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ లో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతోందనే వార్త వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించిన పేట సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది ఈ క్యూటీ. ఈ సినిమా తరువాత నటుడు శశి కుమార్ భార్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Malavika Mohan
Malavika Mohan

రీసెంట్ గా మాస్టర్ సినిమాలో విజయ్ కి జంటగా నటించింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ క్యూటీ ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి తంగళన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం పి.రంజిత్ నిర్వహించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ. జ్ఞానవేల్ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నటి మాళవిక మోహన్ గతంలో కొన్ని హిందీ మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఆమెకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చిందనే వార్త వైరల్ అవుతోంది.

Animal MOvie

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడంతో అదే క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు యూనిట్ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో కథానాయికగా మాళవిక మోహన్ ఎంపికైనట్లు సమాచారం. ఇదే నిజమైతే యానిమల్ సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక మందన్నా సీక్వెల్ లో నటిస్తుందా..లేదా.. అనేది వేచి చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here