టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లలో హీరో శర్వానంద్ కూడా ఒకరు. సినిమాల పరంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. ఇన్నాళ్ళూ సోలో గా లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి రక్షితా రెడ్డి అనే యువతిని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. కాగా త్వరలోనే ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. ఈ క్రమంలో శర్వా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
రాజస్థాన్ లో జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్-రక్షిత వివాహం జరగనుందని సమాచారం. శర్వా పెళ్లి వేడుకలో భాగంగా జూన్ 2న మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహిస్తారని.. 3వ తేదీన శర్వా-రక్షితా పెళ్లి చేసుకోనున్నారని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇక రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ ప్యాలెస్‌లో పెళ్లి అంటే కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలానే శర్వా కూడా తన పెళ్లి కోసం భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే.. సదరు ప్యాలెస్‌లో ఒక్క రోజుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ రెండు రోజలు పెళ్లికి గాను శర్వా మొత్తంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతన్నట్లు తెలుస్తోంది. కోట్ల ఖర్చుతో.. అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ రాయల్ వెడ్డింగ్‌కి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు అతిథులుగా విచ్చేయనున్నట్లు భావిస్తున్నారు.
శర్వానంద్ కి రామ్ చరణ్, రానా బెస్ట్ గరేందశ అని అందరికీ తెలిసిందే. దాంతో వారు కూడా సతీసమేతంగా పెళ్ళికి హాజరవుతారని అనుకుంటున్నారు. శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి. ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి రక్షితా రెడ్డి మనువమరాలు అవుతుంది. రక్షితా రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుందని సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా శర్వానంద్ కు రక్షితా రెడ్డి పరిచయం అయినట్టు తెలుస్తోంది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.