ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలలో రీఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోంది అంతేకాదు అప్పుడప్పుడు తన మాటలతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇంద్రజ జడ్జిమెంట్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈమె జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా భాను పాట పాడినప్పుడు ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో ఆమె చెప్పిన మాటలకు నేటిజల్లు సైతం బాగా ట్రోల్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులతో ఆకట్టుకుంది. ఈసారి షో కి బుల్లితెర టీవీ సెలబ్రిటీలతోపాటు వెండితెరపై అలరించిన కొంతమంది నటీమణులు కూడా వచ్చి సందడి చేశారు. అందులో భాగంగానే యాంకర్ రష్మీ.. హైపర్ ఆది , భాస్కర్ మధ్య తాడు ఇచ్చి ఆటను నిర్వహించారు. ఇక ఆ తర్వాత భాస్కర్ తాడు పట్టుకోగా హైపర్ ఆది ఇంచు కూడా కదిలించలేక పోతాడు.

ఇక తర్వాత శైలజ ఆటలోకి దిగుతుంది. అప్పుడు ఆది పై కౌంటర్ వేసేలా ఇంద్రజ శైలజ మీద గెలిస్తే నువ్వే విన్ అంటూ ఆదికి చెబుతుంది కానీ అప్పుడు ఆది ఇంద్రజకి కౌంటర్ ఇస్తూ.. నువ్వు రా నీ మీద నేను గెలుస్తాను అంటూ కామెంట్లు చేశాడు. దానికి ఆమె ఆల్రెడీ చెన్నైలో నా మీద గెలిచిన ఆయన ఉన్నాడు నాకు ఇంకొకరు వద్దు అంటూ కామెంట్లు చేస్తుంది. మొత్తానికి అయితే హైపర్ ఆది ఈ ప్రోమోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.