Vijay Rashmika : టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వక్కంత వంశీ చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ఈ సినిమాలో నితిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు జనాలు.

అంతేకాదు శ్రీ లీల అందానికే పరిమితం కాకుండా చక్కగా డ్యాన్స్ ఇరగదీసిందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ ఇంటికి వెళ్లగానే నితిన్ ని వారి కుటుంబ సభ్యులు రకరకాల ప్రశ్నలతో వేధిస్తుంటారు. బాలకృష్ణకు నిజంగా కోపమా? కోపం వచ్చినప్పుడు నిజంగా కొడతాడా? పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది? రకరకాల ప్రశ్నలతో అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏం ఉంది? మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారా? వంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలోని నేనెట్టకుంటే నీకేంటి అన్నై పాటను నితిన్ పాడుతాడు. అంటే వేరే వాళ్ల గురించి మీకు ఎందుకురా ? ఇతరుల వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకు..? అనే రేంజ్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. దీని గురించే ప్రెజెంట్ న్యూస్ వైరల్ అవుతుంది..!!