Samantha : ఉన్న డబ్బులు చాలవని కొత్త వ్యాపారం మొదలుపెట్టిన సమంత..!

- Advertisement -

Samantha నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనికి ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా పిక్చర్స్ లక్ష్యం.

Samantha
Samantha

అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే ప్లాట్‌ఫాం ఇది.’ అని పోస్టులో పేర్కొన్నారు. అలాగే ఈ నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా వివరించారు. తన చిన్నప్పుడు విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. నిర్మాణ సంస్థ ప్రారంభించినందుకు సమంతకు ఎంతో మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.

Samantha  Photos

అనుపమ పరమేశ్వరన్, నందినీ రెడ్డి, తేజ సజ్జ, పార్వతి తిరువోత్తు (దూత ఫేమ్), రాహుల్ రవీంద్రన్, రాజ్ అండ్ డీకే… ఇలా ఎంతో మంది సమంత పోస్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారంల్లో అత్యధిక ఫాలోవర్స్ ని కలిగి ఉన్న భారతీయ సినీ సెలబ్రిటీల్లో స్టార్ హీరోయిన్ సమంత ముందంజలో ఉంటారు. సౌత్త తో పాటు నార్త్‌లోనూ భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 30 మిలియన్లను దాటేసింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడిస్తూ ఆనందాన్ని కూడా వ్యక్తపరిచారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here