గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్, Upasana దంపతుల పెళ్లి జరిగి దాదాపు 11ఏళ్లు కావొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తారీఖున ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో పండండి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. అదే నెల జూన్ 30న మెగా ప్రిన్సెస్ ఊయల వేడుక, నామకరణం మహోత్సవం వైభవంగా జరిగింది.

అతిథుల సమక్షంలో పాపకు క్లిన్ కారా
అనే పేరు పెట్టారు. పాప పేరు డిఫరెంట్ గా ఉన్నా ట్రెండీ గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు. అంతటి ఆగకుండా.. క్లిన్ కారా పేరిట ఫ్యాన్ పేజీలను కూడా ఓపెన్ చేశారు. ఈ సంగతి పక్కన పడితే.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పాపను ఇంతవరకు ఎవరికీ చూపించలేదు. అయితే క్లిన్ కారాను చూసేందుకు స్టార్ సెలబ్రెటీలు, బంధువులు, సన్నిహితులు ఇంటికి వెళ్తుండగా.. తన బిడ్డను చూడాలంటే ఉపాసన కండీషన్స్ అప్లై అంటోంది.

తమ బిడ్డను చూడాలంటే కచ్చితంగా కొన్ని షరతులు పాటించాల్సిందే అని ఖరాకండీగా చెప్పేస్తోందట. అవేంటంటే.. ఇప్పుడే పుట్టిన నవజాత శిశువు కాబట్టి.. క్లిన్ కారా వద్దకు ఎవ్వరినీ ఫోన్స్ తీసుకెళ్లవద్దని చెబుతుందట. వ్యాధుల కాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండేందుకు పాపను ఓ స్పెషల్ రూమ్ లో ఉంచుతుందట. తన పాపాను చూసేందుకు వచ్చిన వారిని టచ్ చేయవద్దని చెబుతుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఉపాసన తీరును తప్పబడుతున్నారు. ఇది మరీ టూ మచ్.. ఓవర్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం తన బిడ్డ ఆరోగ్యం పట్ల ఇలాంటి కేర్ తీసుకోవడం కామన్ అంటున్నారు.