సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడి, చివరికి అవకాశం సంపాదించి చిన్న చిన్న రోల్స్ తో తొలుత మెప్పిస్తూ, ఆ తర్వాత సపోర్టింగ్ రోల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గర అయ్యి, ఆ చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరో గా సినిమాలు చేసి సక్సెస్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ. హీరో గా ఆయన నటించిన తొలిసినిమా ‘పెళ్లి చూపులు’ తోనే సిక్సర్ కొట్టేసాడు.
ఆ సినిమా తర్వాత ఆయన హీరో గా చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం ఆ చిత్రం. ఈ సినిమా విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసింది. ఈ చిత్రం తర్వాత ‘గీత గోవిందం’ తో అయితే ఆయన యూత్ లో చెరగని ముద్ర వేసాడు.
ఇండస్ట్రీ లోకి వచ్చిన 5 ఏళ్లకే ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. ఆయన కంటే ముందుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోలు ఎక్కడ మొదలయ్యారో, ఇంకా అక్కడే ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరియు ఫేమ్ ని సంపాదించుకున్నాడు.అందుకే విజయ్ దేవరకొండ అంటే కొంతమంది యంగ్ హీరోలకు పడదు.
ఆయన సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే సంబరాలు కూడా చేసుకున్నారట.ఆ హీరో మరెవరో కాదు, నిఖిల్ సిద్దార్థ. అప్పట్లో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పబ్లిక్ గానే ఈ విషయాన్నీ చెప్తూ ట్వీట్ వేసాడు, దానికి నిఖిల్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఆయన సినిమా ఫ్లాప్ అయ్యినప్పుడల్లా నిఖిల్ తన తోటి హీరోలకు పార్టీ ఇచ్చేవాడని, ఎందుకో ఆయనకీ విజయ్ దేవరకొండ అంటే అసలు నచ్చదు అని, ఇలా పలు రకాల వార్తలు ఇండస్ట్రీ లో ప్రచారం అవుతున్నాయి.